తెలంగాణ రోజువారీ కరోనా కేసుల తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు
  • 357 మందికి పాజిటివ్ నిర్ధారణ 
  • జీహెచ్ఎంసీ పరిధిలో 96 కొత్త కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 6,246
తెలంగాణలో కరోనా వ్యాప్తిపై రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23 కేసులు వెల్లడయ్యాయి. కామారెడ్డి, నారాయణ్ పేట్ జిల్లాలలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 405 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,455 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,46,344 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,246 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,865కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Deaths
Latest Bulletin

More Telugu News